News April 16, 2025

ఆ ఉపాధ్యాయులకు అభినందనలు: నాగర్‌కర్నూల్ డీఈవో 

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం మంగళవారం ముగిసింది. ప్రాధాన్యతతో మూల్యాంకనం పూర్తి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డీఈవో రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసిన ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 24, 2026

చలాన్ కట్టే బదులు.. హెల్మెట్ పెట్టుకోండి: రామగుండం సీపీ

image

రోడ్డు భద్రతే లక్ష్యంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి చలాన్లకు బదులు హెల్మెట్లు పంపిణీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీలు రమేష్, శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, SIలు రమేష్, హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చలాన్ల కంటే మీ ప్రాణాలే మాకు ముఖ్యమన్నారు.

News February 24, 2026

SRCL: ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వసిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలతో పాటు సహస్ర, సాయిశ్రీ కళాశాలలు, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టీజీఎస్ డబ్ల్యూఆర్జేసీ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు వసతులను పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు.

News February 24, 2026

మొబైల్ యాప్‌తో పారదర్శకంగా యూరియా పంపిణీ: DAO

image

రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడకుండా ప్రభుత్వం యూరియా మొబైల్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని DAO స్వరూప రాణి తెలిపారు. మంగళవారం జిల్లాలో యూరియా పంపిణీ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా పొందేందుకు వీలుంటుందని, ఈ కొత్త పద్ధతిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.