News November 13, 2024
ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
Similar News
News November 21, 2024
గుంటూరు: బోరుగడ్డ పిటిషన్‌ను మూడోసారి డిస్మిస్ చేసిన కోర్ట్
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పలు కేసులపై రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట పోలీసులు సాక్ష్యాలు కోర్టు ముందు హాజరు పరిచారు. పోలీసు వారు ఇచ్చిన సాక్ష్యాల మేరకు కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. బెయిల్ పొందడానికి బోరుగడ్డ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని గుంటూరు పోలీసులు తెలిపారు.
News November 21, 2024
గుంటూరు జిల్లా ప్రజలకు ఎస్పీ ముఖ్య గమనిక
ఎవరైనా సాధారణ (లేదా) ఆన్లైన్ యాప్స్(Whatsapp, Telegram, Skype) ద్వారా కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటే భయపడవద్దని ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. డిజిటల్ అరెస్టు పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 21, 2024
ఈపూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన వ్యక్తి
పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈపూరు మండలంలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద సాగర్ కెనాల్ పెద్ద కాలువలో దూకాడు. ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.