News December 20, 2025

ఆ ఎమ్మెల్యేలు BRS భేటీకి వస్తారా?

image

TG: తాము INCలో చేరలేదని ఐదుగురు BRS MLAలు నివేదించడంతో వారిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే KCR ఆధ్వర్యంలో రేపు BRS కార్యవర్గం, LPల భేటీ జరగబోతోంది. పార్టీలోనే ఉన్నామని పేర్కొన్న ఆ MLAలు T.వెంకటరావు, A.గాంధీ, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు ఈ భేటీకి హాజరవుతారా? కారా? అన్నది ఆసక్తిగా మారింది. మిగతా సభ్యులు యాదయ్య, పోచారం, సంజయ్, నాగేందర్, కడియం రాక పైనా చర్చ సాగుతోంది.

Similar News

News December 21, 2025

ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

image

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.

News December 21, 2025

ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!

image

నూతన ఏడాదిలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. భారీ డిమాండ్ దృష్ట్యా గృహాల ధరలు 5 శాతానికి పైగా పెరగొచ్చని 68% మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేసినట్లు క్రెడాయ్-CRE మ్యాట్రిక్స్ సర్వే వెల్లడించింది. ‘10% వరకు రేట్లు పెరగొచ్చని 46%, 10-15% పెరుగుతాయని 18% మంది అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించడంపై దృష్టిపెడుతున్నాం’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ తెలిపారు.

News December 21, 2025

వయస్సు పెరిగినా వివాహం జరగట్లేదా?

image

పెళ్లీడు వచ్చినా సంబంధాలు కుదరకపోవడం, చివరి నిమిషంలో క్యాన్సలవ్వడం వంటి సమస్యలు నేటి కాలంలో అధికమయ్యాయి. దీనికి కుజ, గ్రహ దోషాలే కారణమంటున్నారు జ్యోతిష నిపుణులు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటున్నారు. అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తే వివాహ ఆటంకాలు తొలగుతాయట. గురువారం రోజున ఆవుకు శనగలు, అరటిపండ్లు తినిపిస్తే.. గురు గ్రహ అనుగ్రహం కలిగి త్వరగా వివాహం నిశ్చయమవుతుందని సూచిస్తున్నారు.