News September 23, 2025
ఆ కేసు మరో పరకామణి కేసుగా మారుతుందా..?

భక్తులు పోగొట్టుకున్న వస్తువులు, నగదు, ఆభరణాలు, వాచీలు, ఫోన్లను 2023లో కమాండ్ కంట్రోల్ సిబ్బంది, వీఐ వాటాలు వేసుకొని స్వాహ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. భక్తుల వస్తువుల రికార్డు లేకుండా పంపిణీ చేయడం గమనార్హం. CCటీవీ ఫుటేజీలు సైతం మాయం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను పరకామణి-2 కేసుగా పరిగణనలోకి తీసుకుంటున్న TTD మరిన్ని ఆధారాలు పాలకమండలి ద్వారా బహిర్గతం చేసే అవకాశం ఉంది.
Similar News
News September 23, 2025
స్థానిక ఎన్నికలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న మీడియా చిట్‌చాట్‌లో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్‌కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే అందుకు వచ్చే ఏడాది మార్చి వరకు గడువుందని గుర్తు చేశారు. అటు నిర్ణీత గడువులోపు స్థానిక ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమల పరకామణిలో చోరీ కేసును సిట్‌తో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ తెలిపారు.
News September 23, 2025
సంగారెడ్డి: ‘సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు’

వ్యవసాయ పరికరాల కోసం రైతులు 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై స్పేయర్స్, బ్రష్ కట్టర్స్, వివిధ రకాల పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో మండల వ్యవస్థ అధికారులను సంప్రదించాలని సూచించారు.
News September 23, 2025
H-1B వీసా: డాక్టర్లు, ఫిజీషియన్లకు ఊరట!

H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన US పలు <<17776599>>మినహాయింపులు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కీలక రంగాలకు ఊరటనిచ్చింది. ఇది డాక్టర్లు, ఫిజీషియన్లకూ వర్తించే అవకాశముంది. వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసేవారికి మినహాయింపునిచ్చింది. వీటిలో నిపుణులకు ప్రత్యామ్నాయం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.