News December 30, 2024
ఆ ఘటనల్లో చర్యలు తీసుకోరా?: ఎమ్మిగనూరు MLA
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 2, 2025
KNL: విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు.. YCP ఫైర్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురుకులంలో ఓ విద్యార్థినిపై లైబ్రేరియన్ <<15043665>>లైంగిక<<>> వేధింపులకు పాల్పడిన ఘటన నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ఏపీలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని ఆరోపించింది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారా? అంటూ సీఎం CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.
News January 2, 2025
4 నెలలే దర్శనం.. ఈ ఆలయ చరిత్ర ఘనం!
సంగమేశ్వర దేవాలయం కర్నూలు <<15042913>>జిల్లాలో<<>> ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది.
News January 2, 2025
ఫూటుగా పెగ్గులెత్తారు!
కర్నూలు జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.11.5 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. కర్నూలు జిల్లాలో రూ.6.30 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.5.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.