News December 2, 2025

ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!

image

TG: సెలవు పెట్టకుండా విధులకు హాజరవ్వని టీచర్లపై కొరడా ఝుళిపించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 30 రోజులు స్కూల్‌కు హాజరుకాకపోతే వారి ఇంటికే నోటీసులు పంపిస్తోంది. నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా FRS వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్లు సమాచారం. గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని 50 మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది.

Similar News

News December 5, 2025

ములుగు: ఆ ఒక్కరోజు తేడా వస్తే అంతే సంగతి!

image

పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఓటింగ్ ముందు రోజు అత్యంత కీలకం కానుంది. ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత సింపతీ కూడగట్టుకున్నా ఆ ఒక్కరోజు ఓటర్లను వశం చేసుకోవడం పెద్ద టాస్క్. పంపకాల్లో తేడా వస్తే చేసిన ప్రచారం, అభివృద్ధి, హామీలు నీరుగారిపోయినట్లేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ములుగు(D)లో ఈసారి ప్రధాన, ప్రతిపక్ష అభ్యర్థులే అనేకచోట్ల బరిలో ఉండటంతో అంచనాలు పెరిగాయి.

News December 5, 2025

నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

image

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.