News December 18, 2024
ఆ డేటాను హౌస్ హోల్డ్ సర్వే ద్వారా సేకరించండి: కలెక్టర్

జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను వారం రోజుల్లో పూర్తిచేసి పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటా బేస్‌లో చేర్చాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రగతిపై బుధవారం సమీక్షా నిర్వహించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నవారు డేటాబేస్‌లో నమోదు చేయబడ్డారన్నారు.
Similar News
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.
News February 13, 2026
కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
News February 13, 2026
కృష్ణా: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. కానూరు కుమ్మర్లబజార్‌కు చెందిన బండి క్రాంతికుమార్ 7 నెలల కిందట చిన్నముత్తేవికి చెందిన అమలరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్లే విషయమై ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఈ నెల 11న జరిగిన వాగ్వాదం అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లగా, భర్త ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


