News January 31, 2026

ఆ నెయ్యి శాంపిల్స్ చంద్రబాబు హయాంలో తీసినవే: వెల్లంపల్లి

image

AP: TTD నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసిన‌ట్టు CBI SIT ఛార్జ్‌షీట్‌లో ఎక్క‌డుందో చూపించాలని YCP నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి నేతలకు సవాల్ విసిరారు. ‘ఛార్జ్‌షీట్లోని బ్రీఫ్ నోట్‌తో లోకేశ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. 208-211 పేజీల్లో ఉన్న ల్యాబ్ రిపోర్టు చ‌దువుకోవాలి. CBN హ‌యాంలో తీసిన శాంపిల్స్ పైనే సిట్ రిపోర్టు ఇచ్చింది. దేవుడు విధించే శిక్ష‌ నుంచి CBN త‌ప్పించుకోలేరు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

image

*రెగ్యులర్‌గా హగ్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె సంబంధిత రిస్కులు తగ్గుతాయి.
*స్ట్రెస్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల సహజంగా పెయిన్ రిలీఫ్‌గా పని చేస్తుంది.
*పడుకునే ముందు హగ్ చేసుకుంటే వేగంగా నిద్ర పడుతుంది.
**రోజుకు కనీసం 4 సార్లైనా (ఒక హగ్ 20 సెకన్లు) ఆత్మీయులను హగ్ చేసుకోవాలనేది నిపుణుల సూచన
>>ఇవాళ హగ్ డే.

News February 12, 2026

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300కోట్లు?

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ‘RRR’ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ (రూ.1,200 కోట్లు) కంటే ఎక్కువ అని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు అంతర్జాతీయ మీడియా ‘వెరైటీ’ సైతం వారణాసి బడ్జెట్ దాదాపు రూ.1,300 కోట్లు($150M) అని పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలవనుంది.

News February 12, 2026

గ్లోబల్ మార్కెట్లో నరవణె బుక్.. ప్లాన్ ప్రకారమే లీక్!

image

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19103224>>పుస్తకం లీక్‌<<>>పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్షణ శాఖ అనుమతి లేకున్నా గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం, సమన్వయంతో చేసిన లీక్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పుస్తకం US, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పాయి. దీంతో ఆ దేశాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మార్గాలను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించాయి.