News September 12, 2025

ఆ పెట్టుబడి చిట్కాలు నమ్మొద్దు: వరంగల్ సైబర్ పోలీసులు

image

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలు నమ్మి మోసపోవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అవి పెట్టుబడి చిట్కాలు కావని, సైబర్ వలలని గుర్తించాలని సూచించారు. కొద్ది రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయన్న అత్యాశతో మోసపోవద్దని, సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి, ఆచితూచి అడుగు వేయాలని సూచించారు.

Similar News

News September 12, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో BRS గెలవదు: కాంగ్రెస్

image

‘మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో గెలవరు KTR.. పదేళ్లలో జూబ్లీహిల్స్‌లోని బస్తీవాసులకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లయినా కట్టించిండ్రా?, బడాబాబులకు సద్దులు మోసిన మీరు జూబ్లీహిల్స్‌లో గరీబోళ్లను పట్టించుకున్నారా..?, మీరు ఇక్కడ గెలిస్తే మీ పార్టీ ఏమన్నా అధికారంలోకి అస్తదా?, మీ ఇంట్ల పంచాదినే సక్కదిద్దుకోని మీరు ఇక్కడ గెలిచి ఏం చేస్తరు డ్రామారావు?’ అని తెలంగాణ కాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.

ఏ తల్లి నిను కన్నదో..!

image

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. పసికందు ఏడుపులు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ICDS సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.