News March 20, 2025

ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్.. అన్నీ బంద్: ఎస్పీ శ్రీనివాస్

image

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.

Similar News

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

News September 15, 2025

రేపు ఆర్ట్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సు

image

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.సుంకరి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఉ.11 గం.కు ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News September 15, 2025

డిజిటల్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సోమవారం కోదాడలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.