News April 10, 2025

ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: ప్రకాశం జేసీ

image

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.

Similar News

News December 18, 2025

టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.

News December 18, 2025

టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.

News December 18, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

image

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.