News November 27, 2025

ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

image

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.

Similar News

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.