News December 21, 2025
ఆ మహిళకు ఉద్యోగం, ఫ్లాట్ ఇస్తాం: ఝార్ఖండ్ మంత్రి

బిహార్ CM నితీశ్ <<18574954>>హిజాబ్ లాగిన<<>> ఘటనలో యువతి పర్వీన్ ఆయుష్ డాక్టర్ ఉద్యోగంలో చేరలేదు. దీంతో ఆమెకు అండగా నిలుస్తామని ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓ ఫ్లాట్, ₹3L జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఆమె కోరుకున్న చోట ఇస్తామని మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తెలిపారు. తమ రాష్ట్రంలో ఆమెకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిజాబ్ లాగడం ఆమె వ్యక్తిత్వం, రాజ్యాంగం, హ్యుమానిటీపై దాడి అని విమర్శించారు.
Similar News
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
News December 22, 2025
996 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 996 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 22, 2025
ACC ఛైర్మన్ నఖ్వీకి ఘోర అవమానం

ACC ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి మరోసారి ఘోర అవమానం జరిగింది. దుబాయ్‌లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మెడల్స్ అందించేటప్పుడు నఖ్వీ చేతుల నుంచి వాటిని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో రన్నరప్ మెడల్స్‌ను ICC అసోసియేట్ డైరెక్టర్ ముబాసిర్ ఉస్మానీ అందించారు. నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్ <<18073064>>తీసుకోకపోవడం <<>>ఇది రెండోసారి.


