News September 10, 2025
ఆ రైలుకు బేతంచెర్లలో స్టాపింగ్

కరోనా సమయంలో రద్దైన స్టాపింగ్‌లను ప్రయాణికుల సౌకర్యార్థం 137 స్టేషన్లలో పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా మచిలీపట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొండవీడు రైలు (17211)కు ఈ నెల 10వ తేదీ నుంచి బేతంచర్ల స్టేషనులో రాత్రి 12:34 గంటలకు స్టాపింగ్ కల్పించారు. అదే విధంగా తిరుగు ప్రయాణం (17212)లో ఈ నెల 11వ తేదీ నుంచి బేతంచర్లలో రాత్రి 9:19 గంటలకు స్టాపింగ్ పునరుద్ధరించారు.
Similar News
News September 10, 2025
నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
News September 10, 2025
నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే అంతే..

ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయనడానికి మరో నిదర్శనం నేపాల్. తీవ్ర అవినీతి, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు SMపై బ్యాన్ విధించడంతో నేపాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నుకున్న నేతలనే రోడ్లపై తన్నుకుంటూ తరిమికొట్టారు. PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితులే బంగ్లాలోనూ కనిపించాయి. ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి INDకు వచ్చేశారు.
News September 10, 2025
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేడు సెలవు

అనంతపురంలో నేడు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు సెలవు కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.