News February 21, 2025

ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: వర్మ

image

తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. ‘నా సోషల్ మీడియా అకౌంట్స్‌ను గత మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోంది. నిన్నటి రోజున నా ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడియో గురించి తెలిసిన వెంటనే సిబ్బందిని హెచ్చరించా. వీడియో డిలీట్ చేయించా’ అని వర్మ చెప్పారు.

Similar News

News November 12, 2025

భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: ధర్మారెడ్డి

image

సిట్ అధికారులు విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించానని TTD మాజీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో TTDలో భాధ్యతలు నిర్వర్తించిన అందరూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నన్ను విచారించారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు. వీటితో ప్రజలను పక్కదారి పట్టించవద్దు. భక్తుల మనోభావాలను దెబ్బతీయ వద్దు’ అని ధర్మారెడ్డి కోరారు.

News November 12, 2025

ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వండి: రైతులు

image

బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం ముప్పవరంలో నిర్వహించిన సమావేశంలో రైతులు మాట్లాడారు. ఎకరానికి రూ.50లక్షలు ఇవ్వాలని పంగులూరు మండలం ముప్పవరం, జాగర్లమూడి వారిపాలెం రైతులు చీరాల RDO చంద్రశేఖర్ నాయుడును కోరారు. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న భూములు కోల్పోతున్నామని, వాటికి పరిహారంగా ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాలన్నారు.

News November 12, 2025

HYD: DEC 3 నుంచి టీజీ‌సెట్ హాల్ టికెట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- 2025 పరీక్ష హాల్ టికెట్లను వచ్చే నెల 3వ తేదీ నుంచి తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 29 సబ్జెక్టుల పరీక్షలను వచ్చే నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.