News July 23, 2024
ఆ స్థలాలు రామతీర్థం దేవస్థానానివే: రెవెన్యూ అధికారులు

ఆలయం చుట్టూ ఉన్న స్థలాలు దేవాదాయ శాఖకు చెందినవేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తుండగా స్థానిక దుకాణదారులు అడ్డగించారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వేచేసి, తమ స్థలం అప్పగించాలని ఇటీవల రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం సర్వేచేసి, ఆలయం చుట్టూ స్థలం, కోనేరు దేవస్థానానికి చెందినట్లు తేల్చారు.
Similar News
News April 25, 2025
VZM: వైఎస్ జగన్ను కలిసిన జడ్పీటీసీలు

వైసీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్ల, గజపతినగరం, గంట్యాడ, గరివిడి జడ్పీటీసీలు శీర అప్పల నాయుడు, గార తవుడు, వి.నరసింహమూర్తి, వాకాడ శ్రీనివాసరావు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గురువారం కలిశారు. వైసీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారని జడ్పీటీసీలు తెలిపారు. మాజీ సీఎంను కలిసిన వారిలో రాజాం నియోజకర్గ ఇన్ ఛార్జ్ తలే రాజేశ్ కూడా ఉన్నారు.
News April 24, 2025
రామభద్రపురం : పరీక్షా ఫలితాలు వెలువడకముందే విద్యార్థి సూసైడ్

రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
News April 24, 2025
VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.