News April 15, 2025
ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.
Similar News
News February 28, 2026
ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
News February 28, 2026
కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
VJA: పెట్టుబడి పెట్టి NHAI నుంచి లాభాలు స్వీకరించే అవకాశం

కోల్‌కతా- చెన్నై హైవేలో టోల్ గేట్ల ఆపరేషన్‌కై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ హైవేలో విజయవాడ- చిలకలూరిపేట మధ్య 69.4 కి.మీ. మేర టోల్ గేట్ల నిర్వహణలో పబ్లిక్ ఇన్విట్ విధానంలో ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించి, పెట్టుబడి కంటే పైబడి వచ్చే నగదును లాభం కింద NHAI ప్రజలకు అందిస్తుంది. విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి.


