News January 15, 2026
ఇంకా తేలని జగిత్యాల ఎమ్మెల్యే భవితవ్యం..?

గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. అయితే, ఇటీవలే 10 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వగ.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఫిర్యాదులను తోసిపిచ్చారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపు విచారణ ఇంకా కొనసాగుతూ ఉండగా.. ఇంకా ఆయన భవితవ్యం తేలాల్సి ఉంది. దీంతో సంజయ్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 15, 2026
జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

TGలోని అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.
News February 15, 2026
T20 WC: USA భారీ స్కోర్

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.
News February 15, 2026
రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.


