News October 23, 2025

ఇంజనీర్ టూ రౌడీ షీటర్..

image

ఇంజనీరింగ్ చదువుకున్న చింటూ మరైన్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. అనంతరం మేనమామ కటారి మోహన్‌కు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. చిత్తూరును అప్పట్లో శాసిస్తున్న సీకే బాబుకు దీటుగా చింటూ అంచెలంచెలుగా ఎదిగారు. 2007 డిసెంబర్ 31న సీకే బాబుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్, అనంతరం గన్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రస్తుత కేసులో అనేక షరత్తులతో బెయిల్‌పై ఉన్నారు.

Similar News

News October 23, 2025

పెట్రోల్ బంకులో కానిస్టేబుల్ వీరంగంపై కేసు నమోదు!

image

పెట్రోల్ బంకులో కానిస్టేబుల్ వీరంగం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చీరాల గ్రామీణ సీఐ శేషగిరిరావు తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో భారత పెట్రోల్ బంక్‌లో జరిగిన సంఘటనపై బంక్‌లో పనిచేసే మిక్కిలి అజయ్ కుమార్ వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News October 23, 2025

కరీంనగర్: సిటిజన్ సర్వేకు ప్రజల స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం గతవారం ప్రారంభించిన సర్వే ఈ నెల 25న ముగుస్తుంది. వెబ్సైట్‌ను సందర్శించి సలహాలు సూచనలు తెలపాలని కలెక్టర్ సూచించారు.

News October 23, 2025

తిరుపతి రూయాలో ముగ్గురు మృతి

image

తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో 60, 65, 55 ఏళ్లు వయసు గల ముగ్గురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ పోలీసులు గురువారం మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించారు. మృదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుల ఆధారాలు గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలన్నారు.