News December 26, 2025

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(<>EIL<<>>) 5 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్/బీఎస్సీ(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు నెలకు రూ.80వేలు-రూ.2,20000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.70వేలు-రూ.2లక్షలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in

Similar News

News December 27, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ ఇండియా 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థుల జనవరి 31 వరకు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంబీఏ(HR), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.70,000, అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.83,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ieindia.org

News December 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 109

image

ఈరోజు ప్రశ్న: విదురుడు ఎవరి అంశ? ఏ శాపం కారణంగా ఆయన దాసీ పుత్రుడిగా జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 27, 2025

జనవరి 10న PSLV-C62 ప్రయోగం

image

AP: PSLV-C62 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని SDSC సిద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ తదితరాలను ఉద్దేశించి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. దీంతో పాటు ఓ వర్సిటీ రూపొందించిన శాటిలైట్, అమెరికాకు చెందిన ఓ చిన్న ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.