News May 19, 2024

ఇంజినీర్ నుంచి ఎస్పీగా అనంతపురం ఎస్పీ గౌతమి శాలి

image

అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఈమె.. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలోని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్సీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈమె కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు.

Similar News

News September 12, 2025

5 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: జేసీ

image

జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.

News September 11, 2025

అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్‌కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News September 11, 2025

అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

image

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.