News April 7, 2026
ఇంటర్నెట్‌లో నా వీడియోలు తీసేయించండి: MLA

ఇంటర్నెట్‌లో తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రైల్వే కోడూరు MLA శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ఓ మహిళ తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు ఛానళ్లలో వైరల్ అవుతున్నాయని, ఇవి తన ప్రతిష్ఠతకు భంగం కలిగిస్తున్నాయన్నారు. వీటిని ప్రసారం చేయకుండా చూడాలని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీనిపై వివరాలు ఇవ్వాలని న్యాయమూర్తి కోడూరు పోలీసులను ఆదేశించారు.
Similar News
News April 14, 2026
విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

జగిత్యాల సభ: ఉత్తర తెలంగాణపై KCR వ్యూహం!

TG: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభను KCR ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే BRSలో చేరనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో BRS పట్టు కోల్పోగా INC, BJP పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో సభలో GOVT వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచేందుకు KCR అడుగులు వేస్తున్నారు.