News February 10, 2025
ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739105300367_50225406-normal-WIFI.webp)
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.
Similar News
News February 10, 2025
గుంటూరు: LLB పరీక్షల ఫలితాల విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739190981700_71687173-normal-WIFI.webp)
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన LLB 2వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. LLB కోర్సు పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
News February 10, 2025
VKB: ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739185011708_50949939-normal-WIFI.webp)
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ఆన్‌లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు.
News February 10, 2025
అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739189052303_695-normal-WIFI.webp)
క్రికెట్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్‌తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్ కోసం పాక్ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.