News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
Similar News
News February 17, 2026
భారీ జీతంతో SETలో ఉద్యోగాలు

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 సైంటిస్ట్ E, Fపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech, MSc(CS, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), ME/MTech/PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైంటిస్ట్ F పోస్టుకు నెలకు రూ.1.31L-రూ.2.16L, సైంటిస్ట్ E పోస్టుకు రూ. 1.23L-రూ.2.15L చెల్లిస్తారు.
News February 17, 2026
‘కర్తరీ’ అంటే అర్థం ఇదే..

కత్తెరను సంస్కృతంలో కర్తరీ అంటారు. కత్తెర ఎలా అయితే వస్తువులను రెండుగా కత్తిరిస్తుందో, అలాగే ఈ కాలంలో సూర్యుడి వేడి భూమిని కూడా అలా చీల్చేంత బలంగా ఉంటుందని భావన. సూర్యతాపం కత్తెర లాగా పదునుగా ఉండి, జీవరాశిని పీడించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మన పూర్వీకులు వాతావరణంలోని ఈ తీవ్రతను గమనించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ పేరును ఖరారు చేశారు. అందుకే ఈ కాలాన్ని కర్తరీ రోజులు అని పిలుస్తారు.
News February 17, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

శుభకార్యాల వేళ బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.2,840 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,42,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


