News June 21, 2024

ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర

image

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

ఫిల్మ్‌నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

image

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 25, 2026

రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 200 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది.