News February 1, 2026
ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ అరెస్ట్

AP: విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మొహమ్మద్ ముజామిల్ అనే వ్యక్తిని చిత్తూరు-నాయుడుపేట NHపై అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కాగా గత నెల చిత్తూరు పర్యటనలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Similar News
News February 18, 2026
ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.
News February 18, 2026
CSIR-IICBలో ఉద్యోగాలు

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(I<
News February 18, 2026
కాంగ్రెస్‌లో రాజ్యసభ సీట్లు దక్కేదెవరికో?

TG: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో రాష్ట్రంలోని 2 సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. MLAల సంఖ్య ప్రకారం INCకే ఇవి దక్కవచ్చంటున్నారు. ఆ పార్టీ నుంచి K.కేశవరావు, అభిషేక్ సింఘ్వీ, జీవన్ రెడ్డి, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో BRS RS సభ్యుడిగా ఉన్న KK రాజీనామా చేసి INCలో చేరారు. VH, జీవన్, సుదర్శన్‌లు సీనియర్లు. సింఘ్వీ AICCలో కీలకంగా ఉన్నారు.


