News April 12, 2025
ఇంటర్‌లో కోనసీమ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేనా…

ఇంటర్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తారన్న ధీమా అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్లో 17, సెకండ్ ఇయర్లో 16వ స్థానంలో కోనసీమ నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13,431, సెకండ్ ఇయర్లో 13,881, మొత్తం 27,312 మంది పరీక్షలు రాశారు. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News December 22, 2025
పార్వతీపురం: పీజీఆర్ఎస్‌కు 185 వినతులు

ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో అధికారుల తీరు మారాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. నవంబర్ మాసంలో అర్జీల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 185 వినతులు స్వీకరించారు.
News December 22, 2025
IT అధికారులు మీ వాట్సాప్, మెయిల్ చెక్ చేస్తారా?

ఏప్రిల్ 2026 నుంచి ట్యాక్స్ పేయర్స్ వాట్సాప్, ఈమెయిల్స్‌ను అధికారులు చూస్తారంటూ SMలో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే Income Tax Act 2025లోని సెక్షన్ 247 కేవలం ట్యాక్స్ ఎగవేసే వారి కోసమే తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. నోటీసులకు స్పందించని, ఆదాయం దాచే వారి డిజిటల్ డేటాను కోర్టు పర్మిషన్, సరైన రీజన్‌తో మాత్రమే చెక్ చేసేలా పాత చట్టాన్ని డిజిటల్ కాలానికి తగ్గట్టుగా మార్చారని తెలిపారు.
News December 22, 2025
విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

TG: విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు Dy.CM భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


