News December 24, 2025

ఇంటర్వ్యూతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌ (<>RVNL<<>>) 25 సైట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ST/SC/EWS అభ్యర్థులు జనవరి 13న, OBC అభ్యర్థులు జనవరి 14న, UR అభ్యర్థులు జనవరి 15న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://rvnl.org

Similar News

News December 25, 2025

రేపు బాక్సింగ్ డే.. సెలవు

image

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.

News December 25, 2025

దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

image

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్‌లెట్‌లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.

News December 25, 2025

రోజుకు 4.08 లక్షల లడ్డూల పంపిణీ: TTD ఛైర్మన్

image

AP: DEC 30 నుంచి ఆరంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో వీటి తయారీని పెంచుతాం. లడ్డూల నాణ్యత, రుచి పెంచాం, క్యూలైన్లలో నిరీక్షణ తగ్గించాం’ అని పేర్కొన్నారు. ఆయన లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు.