News December 11, 2025

ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

image

ESIC పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

Similar News

News December 15, 2025

పొట్టి శ్రీరాములుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: CM CBN

image

AP: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ‘గాంధీ బాటలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న ధీరోదాత్తుడు శ్రీరాములు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి సాధించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News December 15, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 15, 2025

అంచనాలను అందుకోని రబీ సాగు

image

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.