News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
Similar News
News February 19, 2026
గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
News February 19, 2026
అతి గొప్ప పురుషుడు ఎవరంటే?

తనలోని కోపాన్ని తానే జయించినవాడు అతి గొప్ప పురుషుడు అవుతాడని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ‘కోపం తనకే ప్రమాదకారి అని, అది తన మొదటి శత్రువని గుర్తించి, పాము తన ఒంటిపై ఉన్న కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా దానిని వదిలించుకోవాలి. కోపం వచ్చినప్పుడు పరీక్షించుకుని, మౌనం పాటించి ఆవేశాన్ని విడనాడేవాడే ఉత్తముడు. తనలోని ఉద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాడే అందరికంటే శక్తిమంతుడు’ అని వివరించారు.
News February 19, 2026
హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు.. ₹70,000 కోట్లకు లెక్క లేదు!

హైదరాబాద్ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ ₹70,000 కోట్ల మేర సేల్స్ లెక్కల్లో చూపలేదని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. బిల్స్ డిలీట్, ఎడిటింగ్ వంటివి చేస్తూ తక్కువ సేల్ చూపించి పన్ను ఎగ్గొడుతున్నట్లు గుర్తించింది. బిల్లింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ డేటాను Ai సహా లేటెస్ట్ టూల్స్‌తో విశ్లేషించగా ఇది తెలిసింది. 2019-20 సం. నుంచి విశ్లేషించిన 10% డేటాతో TN, KA, TG, MH, GJ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తేలింది.


