News November 22, 2025
ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ అర్హతగల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News November 22, 2025
యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


