News January 24, 2026
ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు శిక్షణ

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు 27-01-2026 నుంచి 10-02-2026 వరకు, జనరల్ విద్యార్థులకు 01-02-2026 నుంచి 10-02-2026 వరకు పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపకులకు శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ మార్కుల నమోదు అంశాలపై సూచనలు ఇచ్చారు.
Similar News
News February 10, 2026
అనంతపురంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

అనంతపురంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోడ్ లో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దీక్ష హోమం దశ హారతులు, అనంతరం శేష వాహనంపై నటరాజ అలంకారంలో శ్రీ కాశీ విశ్వేశ్వరున్ని ఊరేగింపు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించారు.
News February 10, 2026
పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. గుత్తి మండలం సేవా గడ్‌లో మంగళవారం సేవాలాల్ జయంతి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ సేవాలాల్, మాతా జగదాంబ లను దర్శించుకుని పూజలు చేశారు.
News February 10, 2026
మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు: వెంకటరామిరెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూను అందరూ మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి లడ్డూను సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


