News December 19, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు

ఏపీ ఇంటర్ బోర్డు రెండు పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మ్యాథ్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2లను మార్చి 4న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 3) నిర్వహిస్తామని ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1, లాజిక్ పేపర్1 మార్చి 21న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 20) ఉంటాయని తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 21, 2025
మరిగించిన టీ.. 20 నిమిషాల తర్వాత తాగుతున్నారా?

టీ కాచిన 20 నిమిషాల తర్వాత తాగడం మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్‌లో ఆక్సిడేషన్ జరిగి బ్యాక్టీరియా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రెండోసారి కాచిన టీ తాగితే జీర్ణాశయ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు. 24 గంటల తర్వాత టీని జపాన్‌లో పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా, చైనాలో విషంతో పోలుస్తారు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది.
News December 21, 2025
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు: బీజేపీ

భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. జార్జ్ సోరోస్‌తో లింక్ ఉన్న బెర్లిన్ హెర్టీ స్కూల్ అధ్యక్షురాలు కార్నెలియా వోల్‌తో రాహుల్ సమావేశమయ్యారని తెలిపారు. ఆయన విదేశీ పర్యటనల్లో పారదర్శకత ఉండాలన్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ సెషన్ సమయంలో/ముందు రాహుల్ విదేశాల్లో పర్యటించడం కొత్తేమీ కాదని, వాటి వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.
News December 21, 2025
‘గోట్ టూర్’ కోసం మెస్సీకి రూ.89 కోట్లు!

మెస్సీ గోట్ టూర్ నేపథ్యంలో కోల్‌కతా మైదానంలో జరిగిన అనుకోని సంఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్గనైజర్ శతాద్రు దత్తా సిట్ విచారణలో కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘ఈ టూర్ కోసం మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించాం. ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్ను కట్టాం. మొత్తం రూ.100 కోట్ల ఖర్చులో మెజారిటీ నిధులు స్పాన్సర్లు, టికెట్ల అమ్మకాల ద్వారా సేకరించాం’ అని చెప్పినట్లు తెలుస్తోంది.


