News March 5, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

image

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష కేంద్రాలను బుధవారం అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తనిఖీ చేపట్టారు. వశిష్ట, సందీపని కళాశాలలోని పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

Similar News

News November 8, 2025

ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

image

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.

News November 8, 2025

కొత్తపల్లి: తండ్రికి తలకొరివి పెట్టిన ముగ్గురు కూతుళ్లు

image

కొత్తపల్లి గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే వృత్తిదారుడు పులి దేవయ్య(65) అనారోగ్యంతో మృతి చెందారు. కుమారులు లేనప్పటికీ, దేవయ్యకు ముగ్గురు కూతుళ్లు సాంప్రదాయాన్ని పక్కనపెట్టి తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ కూతుళ్లకు విద్యనందించి వివాహాలు చేసిన ఆయన ఆదర్శంగా నిలిచారు. దేవయ్య మరణం స్థానికులను విషాదంలో ముంచింది.

News November 8, 2025

2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

image

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.