News February 2, 2025

ఇంటర్ ప్రాక్టికల్స్‌ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

image

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.

News July 5, 2025

ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News July 5, 2025

నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

image

శనివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.