News April 9, 2026
ఇంటర్ ఫలితాలపై బోర్డు క్లారిటీ

TG: ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ట్వీట్ చేసింది. గతంలో ఎప్పుడూ APR మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని గుర్తుచేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి ఫలితాల విడుదల తేదీ మారుతుందని, బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది.
Similar News
News April 14, 2026
‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ‘ నారీ శక్తి వందన్ అధినయం’ బిల్లుకు మద్దతివ్వాలని CM చంద్రబాబు YCP, JSP చీఫ్‌లు జగన్, పవన్ కళ్యాణ్ సహా అన్ని పార్టీల అధినేతలకు, MPలకు లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్న PM మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో, పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని CBN అభిప్రాయపడ్డారు.
News April 14, 2026
జగిత్యాల సభ: ఉత్తర తెలంగాణపై KCR వ్యూహం!

TG: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభను KCR ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే BRSలో చేరనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో BRS పట్టు కోల్పోగా INC, BJP పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో సభలో GOVT వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచేందుకు KCR అడుగులు వేస్తున్నారు.
News April 14, 2026
NTPCలో 55 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NTPC), న్యూఢిల్లీ 55 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో GDMO-20, ఫిజీషియన్ (జనరల్ మెడిసిన్)-25, O&G-8, పీడియాట్రిక్స్-1, ఆప్తమాలజీ-1 పోస్టులు ఉన్నాయి. MBBS,MD, DNB, MS సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 37 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23-4-26. మరిన్ని వివరాలకు www.ntpc.co.in చూడండి.


