News April 12, 2024
ఇంటర్ ఫలితాల్లో అనంత, సత్యసాయి జిల్లా స్థానాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అనంత జిల్లా 60% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో, సత్యసాయి 58% ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలిచింది. అనంతలో 21826 మందికి 13115 మంది.. సత్యసాయిలో 9878 మందికి 5769 మంది పాసయ్యారు. సెకండియర్లో అనంత జిల్లా 78% ఉత్తీర్ణతతో 10వ స్థానం, సత్యసాయి జిల్లా 76 % ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. అనంతలో 15653 మందికి 12210 మంది, సత్యసాయిలో 7447 మందికి 5653 మంది పాసయ్యారు.
Similar News
News April 13, 2026
నేడు కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 11, 2026
‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.


