News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో శ్రీజ 989, హన్సిక 988, వైష్ణవి 978, మయూరి 961, స్ఫూర్తి 942, పల్లవి 935 మార్కులతో మెరిశారు. ప్రథమ సంవత్సరంలో వైష్ణవి MPC 464, శివాని 463, మయూరి BiPC 412, అభిసారిక 385, జ్యోతిక CEC 434, వైష్ణవి 432 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ సుంకర రవి వివరాలు వెల్లడించారు.
Similar News
News April 22, 2025
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్‌ను సన్మానించిన ఎస్పీ

పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.
News April 22, 2025
CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.
News April 22, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీకూతురి మృతి ☞ చాగలమర్రిలో ప్రభుత్వ లాంఛనాలతో రిటైర్డ్ జవాన్ అంత్యక్రియలు ☞ చేనేత కార్మికులకు మగ్గాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ ☞ 1200 సూక్ష్మ చిత్రాలతో ప్రపంచ ధరిత్రి దినోత్సవం చిత్రం ☞ బేతంచర్లలో చిన్నారులను అభినందించిన డోన్ MLA ☞ గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన సంజామల పోలీసులు ☞ సౌభాగ్య రంగు పొడిని విక్రయిస్తే చర్యలు: ఆళ్లగడ్డ MRO