News April 25, 2024

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్.. 32వ స్థానంలో మంచిర్యాల

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 61.55 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 8వ స్థానంలో నిలిచింది. 8551 మందికి 5200 మంది పాసయ్యారు. 61.05 శాతంతో ఆదిలాబాద్ 9 స్థానంలో నిలిచింది. 8551 మందికి 5220 మంది పాసయ్యారు. 56.05 శాతంతో నిర్మల్ 16 స్థానంలో నిలిచింది. 5467 మందికి 3064 మంది పాసయ్యారు. 46.29 స్థానంతో 32వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5455 మందికి 2525 మంది పాసయ్యారు.

Similar News

News February 16, 2026

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.

News February 16, 2026

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.

News February 16, 2026

ADB: ఎల్లుండి స్కూల్స్‌కు సెలవు

image

ఈ నెల 18న ఆదిలాబాద్‌లోని రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అధికార జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 18న బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండవ శనివారాన్ని పని దినంగా పరిగణించాలని, ఈ విషయాన్ని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.