News April 25, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ ఫలితాల్లో హైదరాబాద్ ఇలా..

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ 3 జోన్లు 7, 10, 12వ స్థానంలో నిలిచాయి. HYD-1 జోన్ 62.14 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 28,728 మంది పరీక్షలు రాయగా 17,852 మంది పాసయ్యారు. HYD-2వ జోన్ 59.06 శాతంతో 10వ స్థానంలో నిలిచింది. 35,155 మంది పరీక్షలు రాయగా 20,764 మంది పాసయ్యారు. HYD-3వ జోన్ 58.52 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. 12,698 మంది పరీక్షలు రాయగా 7,431 మంది ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News November 3, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.

News November 3, 2025

పిల్లలను అనాథలుగా మార్చిన మీర్జాగూడ ప్రమాదం

image

మీర్జాగూడ ప్రమాదం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందప్ప-లక్ష్మి దంపతులు. వీరికి భవానీ, శివాలీ(ఆడబిడ్డలు) సంతానం. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. అమ్మ-నాన్నను కోల్పోయిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోయింది. చేవెళ్ల ఆస్పత్రి ఆవరణలో పిల్లల కన్నీరు అందరినీ కలచివేసింది.

News November 3, 2025

HYD: కాంగ్రెస్ అభివృద్ధికి, BRS అవినీతికి మధ్య పోరాటం: కాంగ్రెస్ నేత

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక అనేది కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి, BRS చేసిన అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని TPCC ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేశ్ తెలిపారు. మధురానగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.