News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. వెనుకబడ్డ అల్లూరి జిల్లా

ఇంటర్ ఫలితాల్లో అల్లూరి జిల్లా వెనుకబడింది. ఫస్ట్ ఇయర్‌లో జిల్లాలో 5,645 మందికి 3,153 మంది పాసయ్యారు. 56 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 25వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 5,190 మంది పరీక్షలు రాయగా 3,786 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచింది.
Similar News
News December 29, 2025
FLASH: వికారాబాద్‌లో జిల్లాలో మరోసారి ఎన్నికలు

వికారాబాద్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
☞వికారాబాద్- 34 వార్డుల్లో 63,649 మంది జనాభా
☞కొండంగల్-12, వార్డుల్లో 14,294 మంది
☞పరిగి-18 వార్డుల్లో 18,241 మంది
☞తాండూరు- 36 వార్డుల్లో 71,008 మంది ఉన్నారు. JAN10కల్లా ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు!

మేడ్చల్ జిల్లాలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. GHMC విలీనం అనంతరం మేడ్చల్ జిల్లాలో మిగిలిన 3 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడైంది. అలియాబాద్‌లో 20 వార్డుల్లో జానాభా 18,876, మూడుచింతలపల్లి 24 వార్డుల్లో 24,214, ఎల్లంపేట 24 వార్డులకు 25,823గా జనాభా సంఖ్య ఉంది.
News December 29, 2025
సిరిసిల్ల జిల్లాలో రెండు మునిసిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 1,35,711 జనాభా ఉండగా, ఇందులో 12,891 మంది ఎస్సీలు, 1,557 మంది ఎస్టీలు ఉన్నారు. 2020 మునిసిపల్ ఎన్నికల రికార్డుల ప్రకారం రెండు మున్సిపాలిటీలో కలిపి 69 వార్డులలో 1,10,625 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో యువ ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించనున్నారు


