News June 18, 2024
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పార్వతీపురం జిల్లాకు ఫస్ట్ ర్యాంక్

ఇంటర్మీడియెట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో 6,685 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,570 మంది ఉత్తీర్ణత సాధించారు. 68 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది.
Similar News
News December 14, 2025
VZM: ఎంపికైన కానిస్టేబుళ్లకు ముఖ్య గమనిక..

విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 5 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరుకావాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సూచించారు. అభ్యర్థితో పాటు వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు, కుటుంబసభ్యులకు పోలీసు శాఖ టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. పురుష అభ్యర్థులు నీట్ షేవింగ్‌తో రావాలని సూచించారు.
News December 14, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.
News December 14, 2025
VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.


