News August 16, 2024

ఇంటింటా ఇన్నోవేషన్‌.. 19 ప్రాజెక్టులు ఎంపిక

image

వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి కేవలం 30 మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో 19 ప్రాజెక్టులను ఎంపికచేశారు. నిన్న ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వీరికి పేటెంట్‌ హక్కులు కూడా కల్పించనున్నారు. గద్వాల జిల్లాలో పదికి 3 ప్రాజెక్టులు ఎంపిక చేశారు.

Similar News

News October 1, 2024

యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్

image

యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

News September 30, 2024

NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !

image

✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్