News December 28, 2025
ఇంటింటి సర్వే ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

సచివాలయ సిబ్బందిని నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి కలెక్టర్ హిమాన్సు శుక్ల శనివారం పరిశీలించారు. మేక్లిన్స్ రోడ్డులో నివాసాలకు వెళ్లి సర్వే చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాల్లో చిన్న బజార్, దోర్నాల వారి వీధి, టెంకాయల వీధిలోని సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే, సిబ్బంది విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News December 30, 2025
నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.
News December 30, 2025
నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.
News December 30, 2025
నెల్లూరు: ఆ ఘనత మనకే..!

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.


