News December 23, 2025
ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్ర లేస్తే?

గృహిణే ఇంటికి మహాలక్ష్మి. ఆమె ఉదయాన్నే లేచి ఇంటికి వెలుగునివ్వాలి. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పొద్దెక్కే వరకు పడుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ‘దరిద్ర లక్ష్మి’ ప్రభావంతో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ఉదయాన్నే లేస్తే.. ఆ సమయంలో లభించే గాలి, సూర్యరశ్మి ఇల్లాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆమె ఉత్సాహంగా చేసే పనులు ఇంటిని సంతోషంగా, ప్రశాంతంగా ఉంచుతాయి.
Similar News
News December 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 105 సమాధానం

ప్రశ్న: చిత్రంలో కనిపిస్తున్న వింత ఆకారానికి కొన్ని పురాణాల ప్రకారం ఓ పేరుంది. ఆ పేరేంటి? ఇది ఎవరి అవతారం?
సమాధానం: ఇది ‘నవగుంజర’. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారం. ఒడియా కవి సరళ దాసు రాసిన మహాభారతం ప్రకారం.. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ రూపంలో దర్శనమిచ్చాడు. తొమ్మిది రకాల జీవుల అవయవాలతో కూడిన ఈ విలక్షణ రూపం, భగవంతుడు సమస్త జీవరాశిలోనూ కొలువై ఉంటాడని చాటి చెబుతుంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 23, 2025
‘నీళ్లను ఒక్కసారిగా వదులుతోంది’.. భారత్‌పై పాక్ ఆరోపణలు!

భారత్ కావాలనే నదీ జలాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. చీనాబ్ తర్వాత ఇప్పుడు జీలం, నీలం నదుల ప్రవాహం కూడా తగ్గిపోయిందని అంటోంది. భారత్ అర్ధాంతరంగా నీళ్లు ఆపుతూ ఒక్కసారిగా వదిలేస్తోందని పేర్కొంది. నీటి ప్రవాహం పడిపోవడం తమ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వాదిస్తోంది. దీనిపై మన ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పహల్గాం దాడి తర్వాత ‘సింధు జలాల’ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.
News December 23, 2025
తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.


