News December 10, 2025
ఇంటి చిట్కాలు

* ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.
Similar News
News March 3, 2026
బెంగళూరులో 5 మ్యాచులు ఆడతాం: RCB

IPL-2026లో <<16603983>>బెంగళూరులో<<>> 5 మ్యాచులు ఆడనున్నట్లు RCB ప్రకటించింది. మిగిలిన 2 హోమ్ మ్యాచులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆడతామని వెల్లడించింది. ‘చిన్నస్వామి స్టేడియం మాకు సొంత గ్రౌండ్ కన్నా ఎక్కువ. మా గుర్తింపు ఇక్కడే. అభిమానులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచులను వారు చూడాలి. చర్చలు, అనుమతుల ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని RCB CEO రాజేశ్ మేనన్ తెలిపారు.
News March 3, 2026
చంద్రగ్రహణం తర్వాత ఏం చేయాలి?

ఇవాళ చంద్రగ్రహణం సా.6.47గంటలకు ముగిసింది. గ్రహణం తర్వాత స్నానం చేయాలని పండితులు తెలిపారు. గ్రహణం కంటే ముందు వండిన వంటలు, పచ్చళ్లపై దర్భ పుల్లలు ఉంచాలని చెబుతున్నారు. ఇల్లు, పూజ గదిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల గ్రహణ సమయంలో కేతువు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని నమ్మకం. గ్రహణం తర్వాత దానాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.
News March 3, 2026
హార్ముజ్ మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఎర్ర సముద్ర తీరంలోని యంబు టెర్మినల్ నుంచి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్‌లోని Abqaiq నుంచి పైపుల ద్వారా క్రూడాయిల్‌ను యంబుకు తరలిస్తారు. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు, బాబ్-అల్-మందెబ్ జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంవైపు తరలించవచ్చు.


