News October 27, 2025

ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు అపహరణ

image

ఇంటికి తాళాలు వేసి చుట్టాల ఇంటికి వెళ్లిన వృద్ధ దంపతుల ఇంటిలో దుండగులు చొరబడి రూ.1.60 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఏలూరు త్రీ టౌన్‌లోని శ్రీరామ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన ఇంటి యజమాని బాలగంగాధర్ తిలక్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Similar News

News October 27, 2025

నారాయణపేట: దారుణం.. తల్లిని చంపిన కొడుకు

image

నారాయనపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్‌ నగర్‌లో దారుణం జరిగింది. భీమమ్మ(65) అనే <<18115968>>వృద్ధురాలిని ఆమె చిన్న కుమారుడు రామకృష్ణ నరికి, బండరాయితో బాది చంపాడు<<>>. ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న భీమమ్మను నిందితుడు పారతో నరికినట్లు కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భీమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్‌టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

News October 27, 2025

కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సోమవారం 3 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07132 నరసాపురం-తిరుపతి, నం.07033 నరసాపురం-మైసూరు, నం.07445 కాకినాడ-లింగంపల్లి మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో, ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.