News March 18, 2025

ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

image

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News February 25, 2026

అల్లూరి: డోలీ మోత.. దారిలోనే ప్రసవం

image

అనంతగిరిలో మరో డోలీ మోత ఘటన గిరిజనులు పడుతున్న దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. మల్లిపాడుకు చెందిన గొల్లూరి సుమిత్రకు పురిటి నొప్పులు రాగా (25) బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మార్గమధ్యంలో ప్రసవమైంది. రోడ్డు సౌకర్యం లేక 6 కిలోమీటర్లు డోలీ మోతతో గ్రామస్థులు తీసుకొని వెళ్తుండగా ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 25, 2026

PDPL: సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు

image

రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్‌ కట్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్‌ ఫాల్‌ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుడికి నాణ్యమైన వైద్యం అందించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.

News February 25, 2026

బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

image

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్తో వంటి గుండె స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటి, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవ‌న శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసుకోవాలి.