News January 21, 2026

ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

image

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి IVF శిశువు జననం

image

TG: HYDలోని గాంధీ ఆసుపత్రిలో తొలిసారిగా IVF పద్ధతిలో ఓ ఆడశిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని.. 2025లో IVF ట్రీట్మెంట్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో IVFలో ఓ సైకిల్‌కు సుమారు ₹6లక్షల చొప్పున ఖర్చు అవుతోంది. 2023లో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వం గాంధీలో IVF లాంచ్ చేసింది. ఆ తర్వాత పేట్లబుర్జ్‌ మెటర్నటీ ఆసుపత్రిలోనూ తీసుకొచ్చింది.

News February 25, 2026

ప్రధాని మోదీ అరుదైన ఘనత

image

ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ పార్లమెంటు(క్నెసెట్)లో ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఇరు దేశాల నేతలు ఏఐ, ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్ మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూదుల ఊచకోతకు స్మారకంగా నిలిచిన యద్ వషెంను మోదీ రేపు సందర్శిస్తారు.

News February 25, 2026

జులైకి నల్లమల సాగర్‌ పూర్తి చేస్తాం: CBN

image

AP: 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణా డెల్టా నుంచి నల్లమల సాగర్‌కు తీసుకొస్తాం. జులైకి నల్లమల సాగర్‌ను పూర్తి చేస్తాం’ అని మార్కాపురం సభలో ప్రకటించారు.