News January 11, 2026

ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్: విజయ్ దేవరకొండ

image

డియర్ కామ్రేడ్ మూవీ నుంచే ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్ చూసినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీకి టికెటింగ్ యాప్స్‌లో <<18819623>>రేటింగ్<<>> బ్యాన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘అసలు మనుషులు ఇలా ఎందుకు చేస్తారని మథనపడే వాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. సినిమాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. ఇది పరిష్కారం కాదు.. కేవలం ఉపశమనం మాత్రమే’ అని<> ట్వీట్<<>> చేశారు.

Similar News

News February 21, 2026

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

News February 21, 2026

10% గ్లోబల్ టారిఫ్‌తో లాభమా? నష్టమా?

image

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్‌పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

News February 21, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>AIIMS<<>> బీబీనగర్‌లో 13జూనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. MBBS అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC,ST,PwBD, మహిళలకు ఫీజు లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in